సాయిపూర్ బీఆర్ఎస్కు బీటలు
– హస్తం గూటికి పట్లోళ్ల బొట్టు నర్సింలు
– కాంగ్రెస్లో చేరిన మాజీ వైస్ చైర్ పర్సన్ రత్నమాల
– ఆహ్వానించిన డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని సాయిపూర్ దాదాపు హస్తగతం అయ్యింది. దాదాపు 9 ఏండ్ల పాటు ఏకపక్షంగా ఉన్న సాయిపూర్ బీఆర్ఎస్ పార్టీకి బీటలు వారాయి. ఇటీవల సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ నీరజా బాల్ రెడ్డిలు కాంగ్రెస్లో చేరగా, మొన్న బంటు మల్లప్ప తన అనుచర గణంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న 10వ వార్డుకు చెందిన డీపీసీ మాజీ సభ్యులు పట్లోళ్ల బొట్టు నర్సింలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్ రత్నమాల నర్సింలు హస్తం గూటికి చేరిపోయారు. సాయిపూర్లో పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల బొట్టు నర్సింలు, బాల్ రెడ్డి, బంటు మల్లప్పలు బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన మూలస్థంభాలు.
ఇందులో పట్లోళ్ల నర్సింలు తప్ప మిగతా నేతలంతా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం 10వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలులో పాటు వార్డుకు చెందిన దాదాపు 1500లకు పైగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్బంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మోసపూరిత కారు పాలన మనకొద్దు.. సంక్షేమాన్ని చూపించే కాంగ్రెస్ పాలనను తెచ్చుకుందామని అన్నారు. అదేవిధంగా పట్లోళ్ల నర్సింలు, రత్నమాలలు మాట్లాడుతూ సాయిపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ అందించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, అధికార ప్రతినిధి కల్వ సుజాత, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, అబ్దుల్ రజాక్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రవూఫ్, సాయిపూర్ బాల్ రెడ్డి, మసూద్, జిల్లా అధ్యక్షురాలు శోభరాణి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

