రోహిత్ రెడ్డి ప్రచారానికి రండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రోహిత్ రెడ్డి ప్రచారానికి రండి..!
– కాసాని జ్ఞానేశ్వర్ ను కలిసి బీసీ సంఘం నేతలు
– శాలువా, పుష్పగుచ్చంతో సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి రావాలని ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ను తాండూరు బీసీ సంఘం నేతలు కోరారు. ఆదివారం హైదరాబాద్ లో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ సంఘంతో పాటు ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు కాసాని జ్ఞానేశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి.. పుష్పగుచ్చం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ తో పాటు పలువురు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున ప్రచారానికి రావాలని కాసాని జ్ఞానేశ్వర్ ను కోరారు.

ఇందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే తాండూరుకు వస్తున్నట్లు హామి ఇచ్చారని రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, వికారాబాద్ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, వికారాబాద్ జిల్లా ముదిరాజ్ యువజన సంఘం ఉపాధ్యక్షులు రమేష్ టైలర్, తాండూరు ప్రధాన కార్యదర్శి రాము ముదిరాజ్, సభ్యులు అంతారం సంతోష్, దుబాయ్ వెంకట్, రమేష్, రాజు, హరీ, నవీన్, మల్లేష్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..