హస్తానికి బ్రహ్మరథం..!
– తాండూరు పట్టణంలో జోరుగా ప్రచారం
– పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
– సంక్షేమ రాజ్యం తెస్తామని భరోసా
తాండూరు, దర్శిని ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హస్తం పార్టీ పుల్ జోష్ మీద ఉంది. తాండూరు నియోజకవర్గంలోని మండలాలతో పాటు పట్టణంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. బుధవారం తాండూరు పట్టణంలో జరిగిన ప్రచారం ఉత్సహాంగా సాగింది. ఈ ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. పట్టణంలోని మల్ రెడ్డిపల్లి నుంచి ప్రచార యాత్ర ప్రారంభమయ్యింది. ఈ ప్రచార యాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని హస్తం ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. మనోహర్ రెడ్డి ఇస్త్రీ చేస్తూ.. చిరు వ్యాపారులను, ముసలవ్వలను పలకరించి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీంలను అమలు చేసి తీరుతామన్నారు. నిరపేదల కోసం సంక్షేమ రాజ్య పాలన తెస్తామని భరోసా అందించారు. ఈ క్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. అక్కడి నుంచి పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రచార యాత్ర మందుకు సాగింది.

ఇదికూడా చదవండి…

