కారు గుర్తుకే ఓటేయాలి..!
– పైలెట్ రోహిత్ రెడ్డిని మరువొద్దు
– ఎన్నికల ప్రచారంలో సతీమణి ఆర్తి రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అమ్మా.. అక్కా.. కారు గుర్తుకే ఓటేయాలని, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరువొద్దు అంటూ పైలెట్ సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ తరుపున, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున పట్టణంలోని 25వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి తన ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకున్నారు. టిఫిన్ డబ్బాలో ఓటర్లకు దోష వేసి ఇచ్చారు. గాజుల దుకాణానికి వెళ్లి చేతులకు గాజులు వేయించుకున్నారు. కూరగాయలు విక్రయించారు. ఈ క్రమంలో ఆర్తి రెడ్డి ఓటర్లను ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని కోరారు.
అదేవిధంగా వార్డులలో ఇంటింటికి తిరుగుతూ తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అండగా ఉండాలని కోరారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి మరిత తోడ్పాటు అందిస్తారని, సంక్షేమ పథకాలను అర్హులకు అమలయ్యేలా చూస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, పట్టణ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, పోటీ మహరాజ్ దేవాలయ చైర్మన్ భాసు, మహిళ నాయకులు అనురాధ, అనిత, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

