జయమ్ము నిశ్చయాములే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జయమ్ము నిశ్చయాములే..!
– బుయ్యని మనోహర్ రెడ్డికి మంగళహారతి
– నామినేషన్ల ర్యాలీలో సంఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : అంతా శుభమే.. జయం నిశ్చయం కావాలని కాంగ్రెస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డికి ఆ పార్టీ మహిళా నేతలు మంగళ హారతి ఇచ్చారు. తాండూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుయ్యని మనోహర్ రెడ్డి రెండవ విడత నామినేషన్ దాఖలు సందర్భంగా శుక్రవారం తాండూర్ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ద్వారా ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకోగానే మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ రత్నమాల నర్సింలు, కౌన్సిలర్ నీరజ బాల్ రెడ్డి, మహిళా నేతలు గాజుల మాధవిలు బుయ్యని మనోహర్ రెడ్డికి మంగళ హారతి పట్టారు. జయం నిశ్చయం కావాలని మంగళ హారతి పట్టిన ఈ సంఘటన ఆకట్టుకుంది. అనంతరం మనోహర్ రెడ్డి విజయ కేతనం చూపిస్తూ నామినేషన్ వెళ్లేందుకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గన్నారు.

 

 

ఇది కూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..