గుర్తులకు వేళాయే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గుర్తులకు వేళాయే..!
– నేడే నామినేషన్ల ఉపసంహరణ
– తరువాత గుర్తుల కేటాయింపు
– ఎవరెవరికి ఏమి వస్తాయని ఉత్కంఠ
తాండూరు, దర్శిని ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల దాఖలు, పరిశీలన పూర్తయ్యింది. ఇక మిగిలింది ఉపసంహరణ, తరువాత గుర్తుల కేటాయింపు ప్రక్రియ కార్యక్రమమే. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు తీరనుంది. దీంతో అభ్యర్థుల గుర్తింపు కేటాయింపుపై ఉత్కంఠత ఏర్పడింది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు తాండూరు, వికారాబాద్, పరిగి, కోడంగల్ స్థానాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, బీఎస్పీ ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేసుకున్నారు. నామినేషన్ల పరిశీలన తరువాత తాండూరులో 25 మంది, వికారాబాద్‌లో 19 మంది, కోడంగల్‌లో 15 మంది, పరిగిలో 15 మంది దాఖలను అంగీకరించారు.

నామినేషన్ల ఉపసంహరణకు నేడు గడువు విధించిన సంగతి తెలిసిందే. నేడు నామినేషన్ల ఉపసంహరణ తరువాత ఎంత మంది బరిలో ఉంటారనేది తేలిపోనుంది. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణ తరువాత బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తింపులను కేటాయించనున్నారు. ముందుగా జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు గుర్తులు కేటాయింపు తరువాత స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. స్వతంత్ర అభ్యర్థుల్లో ఎవరికి ఏయే గుర్తులు వస్తాయో అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదికూడా చదవండి..

 మోసపోవద్దు గొసపడతాం..