విద్యార్థులకు చేయూత

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థులకు చేయూత
– బాలికల గురుకుల పాఠశాలకు వాటర్ ట్యాంకు వితరణ
– వైశ్య, ఫెడరేషన్, వాసవిక్లబ్ ఆధ్వర్యంలో అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాల, కళాశాలకు వైశ్య ఫెడరేషన్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చేయూతనందించారు. శనివారం వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర యూత్ కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరు ఫెడరేషన్ అధ్యక్షులు కేళిగారి ప్రవీణ్. వాసవి క్లబ్ అధ్యక్షులు రెడ్డి శెట్టి సతీష్ సహాకారంతో వాటర్ ట్యాంకును అందజేశారు. అదేవిధంగా అదే కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న రుక్మిణీ అనే విద్యార్థిని అంతర్జాతీయ స్థాయి ఖోఖో పోటీలో గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటడడం పట్ల ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు తమ వంతు చేయూతను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, వాసవిక్లబ్ సభ్యులు గుముడాల గౌరీ శంకర్, ఆగీరు మహేష్, బీచ వీరు, దాదాపురం జగ్గు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!