మైనార్టీల మద్దతు మరువలేనిది..!

తాండూరు రాజకీయం వికారాబాద్

 

 మైనార్టీల మద్దతు మరువలేనిది..!
– రాజకీయంగా వాడుకునేందుకు కుట్ర
– కాంగ్రెస్ మాటలకు మోస పోవద్దు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– తాండూరులో మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో నా రాజకీయ భవిష్యత్తుకు మైనార్టీలు ఇచ్చిన మద్దతు మరువలేనిదని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి తాండూరు పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంలో ప్రాధాన్యం కల్పించిందన్నారు. అదేవిధంగా తాండూరులో నా భవిష్యత్తుకు మైనార్టీలు ఇచ్చిన మద్దతు మరువ లేనిదన్నారు. తాండూరులో మంచిగా ఉన్న మైనార్టీలకు కొందరు రాజకీయ పావులుగా వాడుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసే కుట్రలో మోసపోవద్దన్నారు. వారిని నమ్మితే తాండూరు ఆగమైపోతుందన్నారు. తాండూరును కాపాడుకునే పౌరులుగా ఉండాలన్నారు. ఎన్నికల్లో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలన్నారు. పోలింగ్ రోజు కారు గుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు మైనార్టీ నాయకులు ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), వర్కింగ్ ప్రెసిడెంట్ జుబేర్ లాల, నియోజకవర్గ మైనార్టీ నాయకులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

ఇదికూడా చదవండి..

 

సార్లు వస్తున్నారు..!