చైర్మన్‌ అభ్యర్థినే ఓడించిన సర్దార్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చైర్మన్‌ అభ్యర్థినే ఓడించిన సర్దార్..!
– మళ్లీ మున్సిపల్ బరిలో బలమైన నేత
– ఈ సారి ఆ వార్డు నుంచి నామినేషన్
– ఎదురు ఎవరు ఉన్నా బెదురు తప్పదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదేళ్ల క్రితం జరిగిన తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్‌ అభ్యర్థిని ఓడించి.. గెలిచిన సుమిత్ గౌడ్ మళ్లీ పురపోరుకు సిద్దమయ్యారు. సర్దార్ సర్వాయి పాపన్న అంశంకు చెందిన జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ కుటుంబం మొదటి నుంచి రాజకీయాల్లో ఎదురులేని వారుగా గుర్తింపు పొందారు.

రాజుగౌడ్ సోదరుడుగా సుమిత్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సరిగ్గా పదేళ్ల క్రితం తెలంగాణ ఏర్పాటు తరువాత తాండూరు మున్సిపల్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సుమిత్ గౌడ్ చరిత్ర సృష్టించారు. అప్పట్లో బీఆర్ఎస్ చైర్ పర్సన్ అభ్యర్థికి ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగిన సుమిత్ గౌడ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. తెలుగు దేశం పార్టీ ఫ్లోర్ లీడర్‌గా మున్సిపల్ కౌన్సిల్‌ను గడగడలాడించారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో అన్న రాజుగౌడ్‌తో పాటు సుమిత్ గౌడ్ చేరారు. 2019లో జరిగిన ఎన్నిక్లలో రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో ఆయన సతీమణి లతగౌడ్ ఎన్నికల్లో పోటీ చేశారు.

ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో సుమిత్ గౌడ్ మళ్లీ పోట చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున పట్టణంలోని 29వ వార్డు నుంచి సుమిత్ గౌడ్ పోటీ చేస్తున్నట్లు గురువారం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలుతో కలిసి నామినేషన్ వేశారు. మున్నికల్లో ఎదురులేని నేతగా ఉన్న సుమిత్ గౌడ్ మళ్లీ పోటీ చేయడంతో ప్రత్యర్థులు బెదురు చెందక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సందర్బంగా రాజు గౌడ్ మాట్లాడుతూ మా కుటుంబాన్ని ప్రజలు రాజకీయంగా ఎంతో ఆదరిస్తున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేయడంలో భాగంగా కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న సుమిత్‌ గౌడ్‌కు అండగా నిలవాలని కోరారు.

ఇదికూడా చదవండి…

సభలు, ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి