వెల్‌కమ్ సీఎం సార్..!
– కేసీఆర్‌కు నమస్కరించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆర్తీ రెడ్డి
– స్వాగతం పలికిన మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాండూరు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలొని విలియమూన్ గ్రౌండ్‌లో బీఆర్ఎస్ పార్టీ తరుపున ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్ తో తాండూరుకు వచ్చిన సీఎం కేసీఆర్ కు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సతీమణి ఆర్తి రెడ్డిలతో పాటు బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు తదితరులు స్వాగతం తెలిపారు.
అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక వాహనంలో విలియమైన్ మైదానికి చేరుకున్నారు. అక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు సీనియర్ నేతలు సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి…

