కాంగ్రెస్ను నమ్మితే కన్నీళ్లే..!
– అభివృద్ధి కోసం రోహిత్ రెడ్డికి మద్దతివ్వండి
– ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సతీమణీ ఆర్తి రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీని నమ్మితే.. ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణీ ఆర్తి రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున ఎన్నికల ప్రచారం చేశారు. మంగళవారం యాలాల మండలం కోకట్ గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ కరపత్రాలను పంచి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పదేండ్లలో ఎంతో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేసిందన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా తాండూరు అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మితే కన్నీళ్లు మిగులుతాయని అన్నారు. గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దన్నారు. మీ బిడ్డ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఓటేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అవుటి శంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

