అలా జరిగిపోయిందంతే..!

టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

అలా జరిగిపోయిందంతే..!
– కుడి ఎడమయిన బాలెట్‌ మీషన్
– తిరగడబడంతో నిలిచిన పోలింగ్
– పెద్దేముల్ మండలంలో ఘటన
– అధికారులు ఏం చేశారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎన్నికల నిర్వహణలో అనుకోకుండా తప్పిదాలు జరిగి పోతుంటాయి. అలాంటి సంఘటనతో ఓటర్లకు, నేతలకు, అధికారులకు చిక్కులు తెచ్చి పెడతాయి. ఎలా జరిగిందని అలా జరిగిపోయిందనే సమాధానాలు వినిపిస్తాయి. ఇలాంటి సంఘటన తాండూరు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. ఓటింగ్ కోసం వినియోగించే బ్యాలెట్ మిషన్ కుడి వరస ఎడమ వరసగా, ఎడమ వరుస కుడి వరగా పెట్టేశారు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం గిర్మాపూర్‌లోని పోలింగ్ స్టేషన్‌ లో జరిగింది. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు గమనించి గ్రామ నేతలకు వివరించారు. విషయం తెలుసుకున్న నేతలు గ్రామంలో పోలింగ్‌ ను కొద్ది సేపు నిలిపి వేయించారు. గమనించిన సెక్టోరల్ ఆఫీసర్ పరిస్థితిని చక్కదిద్దడంతో మళ్లీ పోలింగ్ యధావిధిగా కొనసాగింది. ఈ సంఘటన తాండూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!