ప్రజ‌ల భ‌ద్ర‌త కోస‌మే నిర్బంధ త‌నిఖీలు

క్రైం తాండూరు వికారాబాద్

ప్రజ‌ల భ‌ద్ర‌త కోస‌మే నిర్బంధ త‌నిఖీలు
– తాండూరు అడిషనల్ ఎస్పీ రషీద్
– రాజీవ్ కాల‌నీలో కార్డెన్ సెర్చ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్ర‌జ‌ల భ‌ద్ర‌త కోస‌మే పోలీసు శాఖ నుంచి నిర్భంధ త‌నిఖీలు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని వికారాబాద్ జిల్లాలా అడిషనల్ ఎస్పీ రషీద్ అన్నారు. శ‌నివారం యాలాల పోలీస్టేష‌న్ ప‌రిధి, తాండూరు ప‌ట్ట‌ణ శివారులోని రాజీవ్ కాల‌నీలో కార్డెన్ సెర్చ్ నిర్వ‌హించారు. తాండూరు డిఎస్పి లక్ష్మీనారాయణ, రూర‌ల్ సీఐ జ‌లంధ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ఈ త‌నిఖీలో అడిషనల్ ఎస్పీ రషీద్ హాజ‌రై కాల‌నీ ప్ర‌జ‌ల వివ‌రాల‌ను తెలుసుకున్నారు. దీంతో పాటు కాల‌నీలో అక్ర‌మ వ్యాపారాలు, అసాంఘీక కార్య‌క్ర‌మాలు, చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌పై ఆరా తీశారు. ఈ ఈ సందర్భంగాా ఆయన మాట్లాడుతూ శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు ప్ర‌జ‌ల భ‌ద్ర‌త కోసం కార్డెన్ సెర్చ్ నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ వంతు బాద్య‌త‌గా శాంతి భ‌ద్ర‌త‌ల‌కు స‌హాకారం అందించాల‌ని సూచించారు. మరోవైపు తనిఖీలలో భాగంగా 37 ద్విచక్ర వాహనాలు, 15 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.ఈ కార్యక్ర‌మంలో యాలాల ఎస్ఐ సురేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.