వైభవంగా అయ్యప్ప పడిపూజ
– హాజరైన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– పాల్గొన్న మాజీ చైర్మన్ వీఎన్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో పడిపూజ వైభవంగా జరిగింది. మంగళవారం బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరిహర గౌడ్ ఆధ్వర్యంలో పడిపూజను నిర్వహించారు. ఆయన కుమారులు కన్నెస్వామి సాయి వర్దన్ గౌడ్, హర్షవర్ధన్ గౌడ్ లు పూజలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మద్య పడిపూజను కొనసాగించారు. పడిపూజలో అయ్యప్ప స్వాముల కీర్తనలు ఆలయాన్ని మార్మోగించాయి. ఈ పడిపూజకు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్మన్ అల్లాపూర్ విశ్వనాథ్ గౌడ్, ఆయన సతీమణి శారదా విశ్వనాథ్ గౌడ్ లు పాల్గొన్నారు. అనంతరం విశ్వానాథ్ గౌడ్ సమక్షంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సరితా హరిగౌడ్, జిల్లా గౌడ సంఘం నాయకులు మల్లికార్జున్ గౌడ్, వివిధ పార్టీల నాయకులు. వార్డు పెద్దలు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

