దరఖాస్తుల దోపిడి..!
– వద్దన్నా.. క్యాస్ట్, ఇన్కమ్ అప్లై
– ఇష్టారాజ్యంగా మీసేవా, ఆన్ లైన్ సెంటర్ల నిర్వాకం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దరఖాస్తుల పేరుతో తాండూరులో దోపిడి రాజ్యం కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజా పాలన అభయ హస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫారాలతో జిరాక్స్ సెంటర్ల నిర్వహకులు ఈ దోపిడికి పాల్పడుతున్నారు. దరఖాస్తులను విచ్చల విడిగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లబ్దిదారులకు అధికారులు ఉచితంగా అందిస్తామన్నా కూడా ప్రజలు జిరాక్స్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. దీన్నే అసరా చేసుకుంటున్న జిరాక్స్ సెంటర్ల నిర్వహకులు ఒక్కో దరఖాస్తు పారాన్ని రూ.20,30,40లు అంటూ విక్రయాలకు పాల్పడుతున్నారు.
అటు అధికారులు ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరణలో హడావుడిగా ఉండడంతో సందులో సడేమియా అన్నట్లుగా వ్యాపారులు దోపిడి తెగబడుతున్నారు. శుక్రవారం తాండూరు పట్టణం వినాయక చౌరస్తాలో ఉన్న ప్రొఫెషనల్ కోరియర్ సెంటర్ వద్ద సామాన్య దరఖాస్తు దారులతో పాటు ప్రజా పాలన దరఖాస్తు దారులు ఫారాల కోసం ఎగబడ్డారు. దీంతో నిర్వహకులు రూ.20 ల చొప్పున ఫారాలను విక్రయించారు. అధికారులకు సమాచారం అందించడంతో నిర్వహకులు వెంటనే కేంద్రాన్ని మూసి వేశారు.
ఇదిలా ఉండగా మరికొన్ని మీసేవా, ఆన్ లైన్ కేంద్రాల వద్ద ప్రజా పాలన దరఖాస్తు ఫారాలతో పాటు క్యాస(కులం), ఇన్ కమ్ (ఆధాయం) సర్టిఫికెట్లు కూడా అవసరమవుతాయని చెప్పి మబ్యపెడుతున్నట్లు తెలిసింది. కొందరి చేత బలవంతంగా ఆప్లై చేయిస్తున్నట్లు ఓ బాధితుడు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి…

