గ్రామాల్లో గస్తీ పెంచాలి

క్రైం తాండూరు వికారాబాద్

గ్రామాల్లో గస్తీ పెంచాలి
– రౌడీలు, పాత నేరస్తులపై నిఘా ఉంచాలి
– తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
– కరణ్ కోట్ పోలీసేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : గ్రామాల్లో గస్తీ ముమ్మరం చేసి శాంతిభద్రతలను పరిరక్షించాలని తాండూరు జీ. శేఖర్ గౌడ్ అన్నారు. ఆదివారం తాండూరు రూరల్ పరిధిలోని కరణ్ కోట్ పోలీస్టేషన్ ను డీఎస్పీ శేఖర్ గౌడ్ సందర్శించారు. పోలీస్టేషన్లో పలు రికార్డులను, పెండింగ్ కేసుల రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ పోలీసులు గ్రామాల ప్రజలతో తత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. పోలీస్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో గస్తీ ముమ్మరంగా చేపట్టాలన్నారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించి నేరస్తులకు శిక్ష పడే విధంగా దృష్టిసారించాలన్నారు. ప్రజలు ఎవ్వరు నేరాలకు పాల్పడకుండా, చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐ మధుసూధన్ రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం