కేవీసీఎస్ ఈజ్ ది బెస్ట్..!

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

కేవీసీఎస్ ఈజ్ ది బెస్ట్..!
– చదువుల్లో, ఆటల్లో ముందుండాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– ఘనంగా ముగిసిన యాన్వల్ స్పోర్ట్ మీట్
– విజేతలకు బహుమతుల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని క్రిష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్) విద్యార్థులు అన్నింట్లో బెస్ట్ గా నిలవాలని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఆకాంక్షించారు. గత మూడు రోజులుగా కేవీసీఎస్ లో జరుగుతున్న యాన్వల్ స్పోర్ట్స్ మీట్-2023-24 పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవీసీఎస్ లో యజమాన్యం విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో ఉత్తములుగా తీర్చిదిద్దడం అభినందనీయన్నారు.

విద్యార్థులు కూడా చదువుతో పాటు క్రీడల్లో బెస్ట్ గా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు స్నేహసంబంధాలు పెంపొందుతాయన్నారు. క్రీడల్లో విద్యార్థులు గెలుపు, ఓటములను సహజంగా తీసుకోవాలన్నారు. ఓటమిని గెలుపుకు పునాదిగా మార్చుకోవాలన్నారు. అనంతరం యాన్వల్ స్పోర్ట్స్ మీట్ లో వాలిబాల్, ఖోఖో, ఇతర పోటీలలో విజేతలకు, రన్నర్ లకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. స్పోర్ట్స్, మీట్ ముగింపు సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రెసిడెంట్ నాగారం నర్సింలు, కమిటి సభ్యులు మల్లేపల్లి వెంకటేశం, మల్లేశం, ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్, సుదర్శన్ రెడ్డి, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం