క్రైం రేట్ తగ్గింది..!
– ఇది మంచి పరిణామం
– బషీరాబాద్ పోలీస్టేషన్ భేష్
– ఈ స్టేషన్‌లో ఒక్క మర్డర్ కేసు లేదు
– సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
– తాండూరు డీఎస్పీతో కలిసి ఠాణా తనిఖీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ డివిజన్‌లోని బషీరాబాద్ పోలీస్టేషన్‌లో క్రైం రేట్ తగ్గిందని, ఈ పోలీస్టేషన్‌లో ఒక్క మర్డర్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం అని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి బషీరాబాద్ పోలీస్టేషన్‌ను తనిఖీ చేశారు. బషీరాబాద్ ఎస్ఐ శంకర్ ఎస్పీ, డీఎస్పీలకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
అంతకుముందు జిల్లా ఎస్పీకి పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ఎస్పీ సిబ్బందితో కలిసి ఠాణా ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలను, పెండింగ్‌లో ఉన్నకేసుల వివరాలను పరిశీలించారు. అదేవిధంగా పోలీసులు శాంతియుత వాతావరణంకు కృషి చేయాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులపట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని, కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లడారు. బషీరాబాద్ పోలీస్టేషన్‌లో కేసుల నియంత్రణలో బెస్ట్‌గా నిలిచిందన్నారు.
గత యేడాది కంటే ఈ యేడాది క్రైం రేట్ తగ్గిందన్నారు. అనుమానాస్పద మరణాలు, ఆత్మహత్యలు, అదృశ్యమైన కేసులు తగ్గిపోయాయన్నారు. ఈ పోలీస్టేషన్‌లో ఈ యేడాది ఒక్క మర్డర్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ వై.నగేష్, ఎస్ఐ శంకర్‌తో పాటు సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

