తాండూరులో అయోధ్య ఉత్సవాలు
– 22 నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు
– గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : అయోధ్య ఉత్సవాలకు తాండూరు ముస్తాబవుతోంది. తాండూరులో భవ్య రామ మందిర ప్రారంభ ఉత్సవాలను పండగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు తాండూరు గోశాల సమితి ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేస్తున్నారు. అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 22 నుంచి ఉత్సవాలు జరుగుతాయని సమితి సభ్యులు ప్రకటించారు. గోశాలలో 22న మొదటి రోజు గోపూజ, వినాయక పూజ, రాముల వారి అభిషేకం, ఉదయం 11 గంటలకు సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
రెండో రోజు 23న సీతారాముల ఊరేగింపు, నగర సంకీర్తనలు, అనంతరం మహాప్రసాదం వితరణ ఉంటుందన్నారు. ఊరేగింపు స్టేషన్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమై డీఎస్పీ కార్యాలయం, కాళికాదేవి ఆలయం, ఇందిరా చౌక్, నెహ్రు గంజ్, మర్రిచెట్టు కూడలి, గాంధీ చౌక్, భద్రేశ్వర చౌక్, మార్వాడీ బజార్, సీతారాంపేట్ పాండురంగ ఆలయం మీదుగా గోశాల వరకు కొనసాగుతుందన్నారు. ఊరేగింపులో పాల్గొనే పురుషులు తెల్లని దుస్తులు, మహిళలు కాశాయం చీరలను ధరించి హాజరు కావాలన్నారు. అదేవిధంగా మూడో రోజు సాయంత్రం గోశాలలో గీతా పారాయణం, సుందరకాండ పారాయణం. భజన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. పూర్తి వివరాలకు సెల్: 9391213193, 9030056755, 6300383211లకు సంప్రదించాలన్నారు. తాండూరులో నిర్వహిస్తున్న. అయోధ్య ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

