ధైర్యంగా ఉండాలి..!
– గుండప్పను పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: అనారోగ్యానికి గురైన ధైర్యంగా ఉంటేనే కోలుకోవచ్చని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరుకు చెందిన న్యాయవాది గుండప్పకు భరోసా అందించారు. ఇటీవలే అనార్యోగానికి గురైన గుండప్ప విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆదివారం తాండూరు పట్టణంలోని సీసీఐ కాలనీలో నివాసంలో కలిశారు. గుండప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సందర్భంలో ఆధైర్య పడొద్దని, ధైర్యంగా ఉంటేనే ఆరోగ్యంగా కోలుకుంటారని భరోసా అందించారు. ఎమ్మెల్సీ వెంట సీనియర్ నాయకులు కరణం పురుషోత్తము రావు, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రావుఫ్, సీనియర్ నాయకులు తాటికొండ పరిమల్ గుప్త, డీపీసీ మాజీ సభ్యులు పట్లోళ్ళ నర్సింహులు, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, నాయకులు కేశవరావు, జీ.రవీందర్, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, బీదర్ రాజశేఖర్, అజయ్ ప్రసాద్, శంకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బి రఘు, అశోక్ తదితరులు ఉన్నారు.



