సీటీ స్కాన్ చిక్కులు దూరం..!

ఆరోగ్యం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

సీటీ స్కాన్ చిక్కులు దూరం..!
– జిల్లా ఆసుప‌త్రిలో ప్రారంభైన సేవ‌లు
– ఫ‌లించిన సూప‌రిండెంట్ కృషి

తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రిలో సీటీ స్కాన్ కోసం వ‌చ్చే చిక్కులు దూర‌మైపోయాయి. ఆసుప‌త్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చారు. గ‌త 18 ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ యంత్రం మూడేళ్ల క్రితం వ‌ర‌కు సేవ‌లందించింది. ఆ త‌రువాత జిల్లా ఆసుప‌త్రిలో దాదాపు రెండున్న‌రేళ్ల పాటు సీటీ స్కాన్ సేవ‌లు స్థంభించిపోయింది. ఆసుప‌త్రిలో సీటీ స్కాన్ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ సునితా మ‌హేంద‌ర్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా మాజీ క‌లెక్ట‌ర్ పౌసుమి బ‌సుతో పాటు జిల్లా ఆసుప‌త్రి సూప‌రిండెంట్ డాక్ట‌ర్ మ‌ల్లికార్జున స్వామి తీవ్రంగా శ్ర‌మించారు. చివ‌ర‌కు విమానాల‌ను త‌యారు చేసే బోయింగ్ కంపెనీ ద్వారా జిల్లా ఆసుప‌త్రిలో ఆధునూత‌న సీటీ స్కాన్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు రూ. 1.5 కోట్ల‌తో జిల్లా ఆసుప‌త్రిలో ఏర్పాటు చేసిన ఈ మిష‌న్‌ను ఆగ‌స్టు చివ‌ర్లో ప్రారంభించారు. అయితే అప్ప‌టి నుంచి సీటీ స్కాన్ ఇస్టాలేష‌న్‌, త‌దిత‌ర ప‌నుల కార‌ణంగా సేవ‌లు ప్రారంభం కాలేదు. ఆసుప‌త్రి సూప‌రిండెంట్ డాక్ట‌ర్ మ‌ల్లికార్జున స్వామి టెక్నీష‌న్‌ను ర‌ప్పించి ప‌నుల‌ను పూర్తి చేయించారు. దీంతో శ‌నివారం ట్రయ‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. విజ‌య‌వంతం కావ‌డంతో ఆసుప‌త్రిలో సీటీ స్కాన్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుక‌వ‌చ్చారు. ఆసుప‌త్రిలో సీటీ స్కాన్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసువ‌చ్చేందుకు సూప‌రిండెంట్ డాక్ట‌ర్ మ‌ల్లికార్జున స్వామి కృషి ఫ‌లించింది. ఆసుప‌త్రిలో సీటీ స్కాన్ సేవ‌లు అందుబాటులోకి రావ‌డం ప‌ట్ల పేద రోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.