విద్యారంగ పరిరక్షణకు కృషి
– జీవో 317 నష్టానికి న్యాయం చేస్తాం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– టీఎస్ యూటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : గాడి తప్పిన విద్యారంగాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఎస్‌యూటీఎఫ్ తాండూరు నియోజకవర్గ శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో గాడి తప్పిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తుందన్నారు.
అదేవిధంగా జీవో 317తో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. చెట్టుకు, పుట్టకోకరు వెళ్లిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను, కార్మికులను సొంత జిల్లాలకు తీసుకవచ్చేందుకు దృష్టిసారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, టీఎసయూటీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి రాములు, ఉపాధ్యక్షులు నర్సింలు, మండల అధ్యక్షులు నారాయణ గౌడ్, వెంకటప్ప, యాలాల మండల అధ్యక్షులు భాను, చైతన్య, నాయకులు గౌరారం గోపాల్, ప్రధానోపాధ్యాయులు నర్స్యా నాయక్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ నాయకులు మహేందర్, గోవర్ధన్, కిష్టప్ప, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రకాష్ గౌడ్, నాయకులు రాంచందర్, సువర్ణ రాణి, మాణెమ్మ, మంజుశ్రీ, శాంత తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

