క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి
– తాండూరు జూనియర్ సివిల్ జడ్జీ శివలీల
– జిల్లా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
తాండూరు,దర్శిని ప్రతినిధి : క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తాండూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శివలీల అన్నారు. శనివారం మండల న్యాయాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుత్రిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శివలీల హాజరై మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. క్యాన్సర్ నియంత్రణకు వైద్యులు చొరవ చూపాలన్నారు. అనంతరం ఆసుపత్రి సూపరిండెంట్ డా. కేవీఎన్ మూర్తి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు.
ప్రాథమిక స్థాయిలో గుర్తించి వ్యాధిని నయం చేయొచ్చన్నారు. మరోవైపు కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తి శివలీల పలు వార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి వైద్యసేవలు అందుతున్నాయని ఆరా తీశారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మఠం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్, ఉపాధ్యక్షులు నర్సప్ప, కార్యదర్శి రజిత, సీనీయర్ న్యాయవాదులు బాలి శివకుమార్, పి.శ్రీనివాస్, అసోయేషన్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

