ఫాస్ట్‌ట్యాగ్‌కు స్వస్తి..!
– కొత్త విధానం అమలుకు నిర్ణయం
– ఎన్నికలకు ముందే స్టార్ట్ చేసేందుకు కసరత్తు
దర్శిని డెస్క్ : టోల్ గేట్లను దాటాలంటే ప్రతి వాహననానికి తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలని కేంద్రం ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. టోల్ గేట్ల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, త్వరితగతిన పేమెంట్స్ పూర్తి చేయడానికి ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమలు చేశారు. 2021లో ఫాస్ట్‌ట్యాగ్ అమల్లోకి వచ్చింది, అప్పటి నుంచి ప్రతి వాహననానికి తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం దాదాపు అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. అయితే ఈ విధానాన్ని ఇప్పడు కేంద్ర ప్రభుత్వం నిలిపివేయాలని భావిస్తోంది.
త్వరలో ఫాస్ట్‌ట్యాగ్ ప్లేస్‌లో జీపీఏస్ బేస్డ్ విధానం అమలులోకి తీసుకవచ్చేందుకు కసరత్తు చేస్తుంది. జీపీఎస్ విధానం అమలులోకి వచ్చిన తరువాత ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నీషన్ సిస్టెమ్ ద్వారా టోల్ కట్ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం శాటిలైట్‌తో ముడిపడి ఉంటుంది. టోల్ విషయంలో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో కొత్త సిస్టం అమలుచేయడానికి కేంద్రం సిద్ధమైంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్‌ను ఏప్రిల్ నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో జరిగే 2024 లోక్‌సభ ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి రాకముందే ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టిసారిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం కన్సల్టెంట్‌ను కూడా నియమించినట్లు సమాచారం. ఏప్రిల్ తరువాత వీటన్నింటిని దశల వారీగా తొలగించే అవకాశం కనిపిస్తోంది.
ఇదికూడా చదవండి…

