చైర్ ప‌ర్స‌న్, మాజీ చైర్ ప‌ర్స‌న్‌ల‌ను క‌లిసిన అఫ్పూ(న‌యూం)

తాండూరు వికారాబాద్

చైర్ ప‌ర్స‌న్, మాజీ చైర్ ప‌ర్స‌న్‌ల‌ను క‌లిసిన అఫ్పూ(న‌యూం)
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్, మాజీ చైర్ ప‌ర్స‌న్‌ల‌ను, వైస్ చైర్ ప‌ర్స‌న్‌ల‌ను టీఆర్ఎస్ పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం) క‌లిశారు. టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులుగా నియామ‌క‌మైన సంద‌ర్భంగా అఫ్పూ(న‌యూం) ఆదివారం మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్,
మాజీ చైర్ ప‌ర్సన్‌లు కోట్రిక విజ‌య‌ల‌క్ష్మీ, సునితాసంప‌త్‌, వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలు, మాజీ కౌన్సిల‌ర్ ప‌ట్లోల్ల సావిత్రమ్మ‌తో పాటు నాయ‌కులు ప‌రిమళ్ గుప్త‌, ప‌ట్లోళ్ల న‌ర్సింలును మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.
ఈ సంద‌ర్భంగా వారు అఫ్పూను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంత‌రం అప్పూ తాండూరులో టీఆర్ఎస్ పార్టీ బ‌లోపేతానికి స‌హ‌క‌రించాల‌ని చైర్ ప‌ర్స‌న్, మాజీ చైర్ ప‌ర్స‌న్‌లు, వైస్ చైర్ ప‌ర్స‌న్, నాయకుల‌ను కోరారు. ఇందుకు అంద‌రం క‌లిసి కృషి చేద్దామ‌ని నాయ‌కులు భ‌రోసా ఇచ్చారు.