ఎస్ఐలకు స్థాన చలనం
– జిల్లాలో నలుగురి బదిలీ
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో నలుగురు ఎస్ఐలకు స్థాన చలనం కలిగింది. ఈమేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివరాలను జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కుల్కచెర్ల ఎస్ఐ శ్రీశైలంను బంటారం పోలీస్టేషన్‌కు బదిలీ చేశారు. వికారాబాద్ పోలీస్టేషన్ ఎస్ఐ అన్వేష్ కుమార్‌ను కుల్కచర్ల పోలీస్టేషన్‌కు బదిలీ చేశారు. బంటారం ఎస్ఐ అనంత్ కుమార్ ను దోమ పోలీస్టేషన్‌కు బదిలీ చేయగా, దోమ ఎస్ఐ రవిని వికారాబాద్ వీఆర్‌కు బదిలీ చేశారు. వికారాబాద్ వీఆర్ లోని ఎస్ఐ కాశినాథ్‌ను తాండూరు పట్టణ పోలీస్టేషన్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా జీవీ సత్యనారాయణను వికారాబాద్ పట్టణ పోలీస్టేషన్‌కు ఎస్ఐగా బదిలీ చేశారు.
ఇది కూడా చదవండి…

