జోష్… శృతి మించొద్దు…!

తాండూరు వికారాబాద్

జోష్… శృతి మించొద్దు…!
– డీజే సౌండ్‌లకు, పామూహిక వేడులకు అనుమతి లేదు
– మద్యం సేవించి రోడ్లపైకి వస్తే కేసులే
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వ‌చ్చే నూతన సంవత్సర వేడుకలు శృతి మించకుండా జరుపుకోవాలని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సూచించారు. ఆయన డిసెంబ‌ర్ 31, న్యూ ఇయర్ వేడుకలపై తాండూరు ప‌ట్ట‌ణంలో విధిస్తున్న ఆంక్షలపై ప్రకటన విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిబంధనలు విధించిందన్నారు. డీసెంబ‌ర్ 31 అర్ద‌రాత్రి వేడుక‌ల‌లో, కొత్త సంవత్సర వేడుకలలో డీజేలకు పెట్టుకోవద్దని, సామూహిక వేడుకలను జరుపుకోవద్దన్నారు. డీజేలకు, సామూహిక వేడుకలకు అనుమతులు నిషేధించడం జరిగిందన్నారు. అదేవిధంగా మద్యం సేవించి రోడ్లపై రావద్దన్నారు. రోడ్లపైకి వస్తే డ్రంక్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎవరి ఇండ్ల వద్ద వారే నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలన్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించి నూత‌న సంవ‌త్స‌ర వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.