కల్లు సోసైటీ చైర్మన్‌గా మేఘనాథ్ గౌడ్

తాండూరు రాజకీయం వికారాబాద్

కల్లు సోసైటీ చైర్మన్‌గా మేఘనాథ్ గౌడ్
– కొత్త కార్యవర్గం ఎన్నిక తీవ్ర ఆసక్తికరం
– చర్చనీయాంశంగా చేతులు మారిన సోసైటీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు కల్లు సోసైటీ కొత్త కార్యవర్గం ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. సోసైటీ కొత్త చైర్మన్‌గా కాంగ్రెస్ యువనాయుడు, మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ చైర్మన్‌గా ఎన్నిక కావడం ఆసక్తికరంగా మారింది. తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ కల్లు సోసైటీ గత పదేళ్లుగా కొనసాగుతోంది. తాజాగా విశ్వనాథ్ గౌడ్ చేతుల్లో నుంచి డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్ చేతుల్లోకి మారడం నాటకీయ పరిణామాలకు దారితీసింది. గత కొన్ని రోజులుగా కల్లు సోసైటీలో లుకలుకలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జోక్యంతో తాజాగా కల్లు సోసైటీకి ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో సోసైటీ చైర్మన్‌గా రవీందర్ గౌడ్ వర్గంకు చెందిన మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్‌ను ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులుగా రాజుగౌడ్‌ వర్గంకు చెందిన శ్యాంగౌడ్(నాగరాజు గౌడ్), డైరెక్టర్లుగా కిషొర్ గౌడ్, మహేందర్ గౌడ్, ప్రమోద్ గౌడ్ , సభ్యులుగా వెంకట్రామ్ గౌడ్, వినోద్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్‌లు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు హైడ్రామా మద్య జరిగినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు చైర్మన్‌గా కొనసాగిన హరిగౌడ్ తనకు సమాచారం అందించకుండా ఎన్నికలు నిర్వహించారని వాగ్వివాదం చేయడంతో పాటు పురుగుల మందు సేవించడం సోసైటీ ఎన్నికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి కల్లు సోసైటీ విశ్వనాథ్ గౌడ్ చేతుల్లో నుంచి రవీందర్ గౌడ్‌ చేతుల్లోకి వెళ్లింది. నేడో, రేపో కొత్త కార్యవర్గం కార్యకలాపాలను చేపట్టబోతోందని ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!