వైభోగం.. శ్రీవారి కళ్యాణోత్సవం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభోగం.. శ్రీవారి కళ్యాణోత్సవం..!
– దస్తగిరిపేట్‌లో ఘనంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవం
– శోభాయామానంగా పల్లకిసేవ, భారీగా తరలివచ్చిన భక్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం అనుబంద గ్రామం దస్తగిరిపేట్(చంద్రగిరిపట్నం)లో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవం, రథోత్సవ వేడుకలు వైభోగంగా జరిగాయి. స్వామి వార్ల కళ్యాణోత్సవం, రథోత్సవ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి ప్రారంభమైన దేవాలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆలయ దర్మకర్తలు, అర్చకులు వెంకటచార్ శుక్రవార్, రాఘవాచార్ శుక్రవార్, పురందరాచార్ శుక్రవార్, సుదీర్ పంతులు, అశోక్ గౌతం, మాజీ ఎంఈఓ దత్తాత్రేయ రావుల ఆధ్వర్యంలో స్వామి వార్ల కళ్యాణోత్సం జరిపించారు.

వధూ వరుల తరుపున రాఘవేంద్రచార్ శుక్రవార్, నిర్మలా దంపతులతో పాటు గంగిశెట్టి అనురాధ, శ్రీనివాస్ దంపతులు కూర్చుని కళ్యాణోత్సవాన్ని కమణీయంగా కొనసాగించారు. వేద మంత్రోచ్చరణ మద్య స్వామి వారు మాంగల్య ధారణ చేయడం రమణీయతను తలపించింది. అనంతరం స్వామి వార్లను పల్లకిలో ఊరేగిస్తూ రథోత్సవ వేడుకలను నిర్వహించారు. రథోత్సవంలో స్వామి వారి పల్లకిని 300 మీటర్ల వరకు లాగారు.

అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, తాండూరు సీఐ సంతోష్ కుమార్, వ్యాపారులు గుముడాల సుధాకర్, గిట్టిల సుబ్బారావు, భగవాన్ దాస్, పూసల రమేష్, చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కోట్రిక కిరణ్, ఆకుల శ్రీకాంత్, నూనే నర్సింలు, అంతారం మాజీ సర్పంచులు ఎత్తరి రాములు, వడ్డె శేఖర్, ఎంపీటీసీ శాంతు, పుల్లా ప్రభాకర్ రెడ్డి, కుమ్మరి నర్సింలు, బీజేపీ నాయకులు శ్రీనివాస్, బోయిని అంబ్రేష్, జగదీష్ గౌడ్, నరేష్, గ్రామ పెద్దలు, యువకులు భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

సార్లు వస్తున్నారు..!