ఎమ్మేల్యే బైక్ రైడ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మేల్యే బైక్ రైడ్..!
– స్వయంగా సమస్యలను తాండూరు ఎమ్మెల్యే
– మనోహర్ రెడ్డి పనితీరుకు ఫిదా
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజా సేవకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని ఎన్నికల్లో ఉపన్యాసం ఇచ్చే నేతలను ఎంతో మందిని చూస్తుంటాం. ఎన్నికల తరువాత ప్రజా సమస్యలపై దృష్టి సారించే నేతలను చూసినప్పుడు ఫిదా అవుతాము. అలాంటి పనితీరుతో ప్రజల మనసు దోచుకున్నారు తాండూరు ఎమ్మేల్యే బయ్యని మనోహర్ రెడ్డి. బైకుపై వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసు కున్నారు. వివరాల్లోకి వెళితే.. శనివారం యాలాల మండల పర్యటనలో ఎమ్మేల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

 

 

ఇందులో భాగంగా యాలాల్ – విశ్వనాథ్ పూర్ వాగు సమీపంలో ఉన్న శివాలయం దేవాలయంకు సరైన రహదారి లేదని శివస్వములు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యే శివాలయానికి కారు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఓ శివ స్వామి బైక్ పై ప్రయాణించారు. శివ స్వాముల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మేల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే రోడ్డు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మరోవైపు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బైక్ పై వెళ్లి స్వయంగా సమస్యను తెలుసుకోవడం పట్ల ఆయన పనితీరుకు అందరూ ఫిదా అయ్యారు. పలువురు నేతలు ఎమ్మెల్యే పట్ల హర్షం వ్యక్తం చేశారు.

 

 

ఇదికూడా చదవండి..

సార్లు వస్తున్నారు..!