భారీ శబ్దాలు చేస్తే చర్యలు తప్పవు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

భారీ శబ్దాలు చేస్తే చర్యలు తప్పవు
– సైలెన్సర్‌ బైకు యజమానులపై కేసులు
– వాహనదారులకు తాండూరు పోలీసుల హెచ్చరిక
తాండూరు,  దర్శిని ప్రతినిధి : భారీ శబ్దాలు చేస్తూ కాలుష్యానికి పాల్పడితే వాహదారులపై చర్యలు తప్పవని తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం పట్టణంలో పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో బైకులకు ఇదివరకు ఉన్న సైలెన్సర్లను తొలగించి.. మార్పులు చేసి పెద్ద శబ్దాలు వచ్చే సైలెన్సర్లను బిగించినట్లు గుర్తించారు. దీంతో పలువురిపై కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా పట్టణ సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల సైలెన్సర్లలో మార్పులు చేసి.. శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎక్కువ శబ్దాలతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అతిగా శబ్దం చేసే సైలెన్సర్లతో వాహనదారులు పట్టుబడితే తొలిసారి రూ.వెయ్యి జరిమానా విధిస్తామని, రెండోసారి పట్టుబడితే రూ.2వేలు జరిమానా విధించనున్నట్లు చెప్పారు. వరుసగా ట్రాపిక్‌ ఉల్లంఘనకు పాల్పడితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!