గాంధీనగర్‌లో సమస్యల తిష్ట..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గాంధీనగర్‌లో సమస్యల తిష్ట..!
– నీళ్లు రావు, మురుగు తీయరు
– పట్టించుకోని వార్డు కౌన్సిలర్
– ఆవేధన వ్యక్తం చేసిన వార్డు ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్‌లో సమస్యలు తిష్టవేశాయని, వార్డు కౌన్సిలర్ పట్టించుకోవడం లేదని ప్రజలు గురువారం ఓ ప్రకటనలో ఆవేధన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీనగర్‌లో నీళ్లు సక్రమంగా రావడం లేదని తెలిపారు. మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదని అన్నారు. పారిశుద్ధ్యం వల్ల ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. విద్యుత్ స్థంబాలకు వీధి దీపాలు లేక రాత్రి వేళ అవస్థలు పడుతున్నామన్నారు.

వార్డు కౌన్సిలర్ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. తమ కాలనీ సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. అదేవిధంగా కాలనీలో అభివృద్ధి చేయడం లేదని అన్నారు. ఈ సమస్యలపై అడిగితే ఆ పార్టీకి పనిచేశారు.. ఈ పార్టీకి పనిచేశారని అంటున్నారని విమర్శించారు. కౌన్సిలర్ తమ ఇంటి వరకే అన్ని పనులు చేయించుకుంటున్నారని వాపోయారు. తాను పనిచేయకుండా చైర్ పర్సన్, కమీషనర్లపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ చైర్ పర్సన్ అయినా చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు యువకులు, మహిళలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మున్సిపల్‌లో అవినీతి, అక్రమాలు..!