ఏసీబీ ట్రాఫ్‌లో అవినీతి అధికారులు

క్రైం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

ఏసీబీ ట్రాఫ్‌లో అవినీతి అధికారులు
– కోలాపూర్‌లో ఎమ్మార్వో, ప‌రిగిలో ఎస్ఐ
– లంచాలు తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన వైనం
వికారాబాద్‌, ద‌ర్శ‌ని ప్ర‌తినిధి: ఏసీబీ వ‌ల‌లో అవినీతి అధికారులు ప‌ట్ట‌బ‌డ్డారు. వేర్వేరు జిల్లాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌లు క‌ల‌క‌లం రేపాయి. వికారాబాద్ జిల్లా ప‌రిగిలో, నాగ‌ర్ కర్నూర్ జిల్లాలోని కొల్లాపూర్‌లో ఈ సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. వికారాబాద్ జిల్లా ప‌రిగిలో ఎస్ఐగా ప‌నిచేస్తున్న పాటిల్ క్రాంతి కుమార్ ఓ కేసు విషయంలో 15 వేలు డిమాండ్ చేయగా 10వేలు ఇస్తుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.
మ‌రోవైపు నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో రైతుకు సంబంధించి ఏడు డాక్యుమెంట్స్ ఇవ్వడానికి త‌హ‌సీల్దార్ షౌక‌త్ అలీ రూ. 12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అత‌నితో పాటు వీఆర్ఏ కృష్ణ, కంప్యూటర్ ఆపరటర్ శివల‌ను కూడ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కాగా కొల్లాపూర్‌లో ప‌నిచేస్తున్న త‌హ‌సీల్దార్ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వారు కావ‌డంతో జిల్లాలో ఏసీబీ దాడులు క‌ల‌క‌లం రేపాయి.