ఆర్యవైశ్య ఆణిముత్యం..!
– ఈఏపీసెట్‌లో 339వ ర్యాంకు
– హర్షం వ్యక్తం చేస్తున్న వైశ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన విద్యార్థులు చదువుల్లో సత్తా చాటుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ఈఏపీసెట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి తాండూరు కీర్తి ప్రతిష్టతలను పెంచుతున్నారు. తాండూరుకు చెందిన నవ్యరెడ్డి(864), వైష్ణవి(413)లతో పాటు ఆర్యవైశ్యులకు చెందిన సంకేత్ కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించి వాళ్ల అందరికంటే ఔరా అనిపించుకున్నాడు.
తాండూరులోని ఆర్యవైశ్యుడు ముచ్చర్ల శ్రీనివాస్ కుమారుడు ముచ్చర్ల సంకేత్ ఈఏపీసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 339వ ర్యాంకు సాధించాడు. సంకేత్ సాధించిన ఘనత పట్ల తాండూరు ఆర్యవైశ్యులు అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంకేత్ మునుముందు మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ శుభాశీస్సులు అందిస్తున్నారు.


ఇదికూడా చదవండి…

