దేవీ న‌మోస్తుతే..!

తాండూరు

దేవీ న‌మోస్తుతే..!
– వైభ‌వంగా శ‌ర‌న్న‌వ‌రాత్రుల ప్రారంభం
తాండూరు, ద‌ర్శ‌ని ప్ర‌తినిధి: దేవీ న‌మోస్తుతే.. అంటూ భ‌క్తులు దుర్గామాత‌ను వేడుకున్నారు. గురువారం తాండూరు ప‌ట్ట‌ణంలో దేవీ శ‌ర‌న్న‌వరాత్రుల ఉత్స‌వాలు వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా పట్ట‌ణంలోని కాళీకాదేవి ఆల‌యంలో అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అదేవిధంగా ప‌ట్ట‌ణంలోని సాయిపూర్, ఇందిరాన‌గ‌ర్‌, మ‌ల్ రెడ్డిప‌ల్లి, ర‌మ‌హ‌త్ న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో మండ‌పాల‌ను ఏర్పాటు చేసి అమ్మ‌వారిని ప్ర‌తిష్టించారు. సాయంత్రం వేళ అమ్మ‌వారు కొలువు దీరిన మండ‌పాల్లో భ‌క్తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణంలోని సాయిపూర్‌లో ప్ర‌తిష్టించిన అమ్మ‌వారికి టీఆర్ఎస్ నాయ‌కులు సాయిపూర్ బాల్‌రెడ్డి, సీనీయ‌ర్ కౌన్సిల‌ర్ ప‌ట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డిలు పూజ‌లు నిర్వ‌హించారు. పూజ‌ల అనంత‌రం మ‌హిళ‌లు మండ‌పాల వ‌ద్ద మ‌హిళ‌లు ఆడిపాడి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.