ప్రతి తెలంగాణ బిడ్డ చూడాల్సిన సినిమా
– బీజేపీ కౌన్సిలర్ సాహు శ్రీలత
– వార్డు ప్రజలకు రజాకార్ చిత్ర ప్రదర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ‘రజాకార్’ తెలంగాణ ప్రతి బిడ్డ చూడాల్సిన సినిమా అని తాండూరు మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీ కాంత్ అన్నారు. గురువారం తాండూరు పట్టణం చంద్ర థియేటర్లో ప్రదర్శిస్తున్న రజాకార్ సినిమాను సాహు శ్రీలత తన వార్డు 24కు చెందిన ప్రజలతో కలిసి చూశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో నిజాం పాలనలో రజాకార్లు సాగించిన దాషి కాలను అందరు తెలుసుకునేందుకు వార్డు ప్రజలకు సినిమా చూపించడం జరిగిందన్నారు.
ఈ చిత్రంలో అప్సట్లో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని అన్నారు. అరాచాకాలు, ఆకృత్యాలపై పోరాడి వీరమరణం పొందిన కథలను సజీవంగా నిలిచిందనేలా చూపించారన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన తీరు భావేద్వంగా ఉందన్నారు. ప్రజల తిరుగుబాటు, ఉద్యమ అంశాలతో కూడిన రజాకార్ చిత్రాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఇదికూడా చదవండి…

