బీజేపీ పట్టణ కార్యవర్గం ఎన్నిక
– ప్రకటించిన పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ తాండూరు పట్టణ కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గాన్ని పార్టీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ప్రకటించారు. పట్టణ ఉపాధ్యక్షులుగా దోమ కృష్ణ, మంతటి రాజు, కోట్ల నరేందర్ రెడ్డి, సంగమేశ్వర్, చిద్రి ప్రకాష్, శృతి, ప్రధాన కార్యదర్శులుగా అంతారం కిరణ్, మిట్టి శ్రీనివాస్, ప్రవీణ్, కార్యదర్శులుగా రాంచెందర్, శివాజీ ఠాకూర్, పోల శ్రీనివాస్, అల్లకోటి బిచ్చప్ప, కావలి కృష్ణ, కోశాధికారిగా ప్రహాల్లాదరావు జాదవ్, బీజేవైఎం అధ్యక్షులుగా తాండ్ర నరేష్, మహిళ మోర్చ పట్టణ అధ్యక్షురాలుగా అర్చన, కిసాన్ మోర్చ్ అధ్యక్షులుగా శివకుమార్, దళిత మోర్చ్ అధ్యక్షులుగా లల్లూ ప్రసాద్, ఓబీసీ మోర్చ్ అధ్యక్షులుగా నరేష్ కుమార్, గిరిజన మోర్చ్ అధ్యక్షులుగా శ్యాంసుందర్ నాయక్, మైనార్టీ మోర్చ్ అధ్యక్షులుగా ఎస్కే షాబోద్దీన్ లు ఎన్నికైనట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ మోర్చ నాయకురాలు అంతారం లలిత, నాయకులు నరేష్ మహారాజ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

