బీఆర్ఎస్ మండల పార్టీకి కొత్త అధ్యక్షులు

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ మండల పార్టీకి కొత్త అధ్యక్షులు
– తాండూరు మండల అధ్యక్షులుగా వీరేందర్ రెడ్డి
– నియమించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో సుమారు నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి భర్తి అయ్యింది. పార్టీ తాండూరు మండల అధ్యక్షులుగా సిరిగిరిపేట్ వీరేందర్ రెడ్డి నియామకం అయ్యారు. గురువారం తాండూరుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆయన నియామకాన్ని ప్రకటించారు. గతంలో పార్టీ మండల అధ్యక్షులుగా కొనసాగిన గుర్రంపల్లి రాందాస్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అప్పటి నుంచి దాదాపు నాలుగు నెలల పాటు మండల పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఏర్పడింది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మండలంలోని కోటబాస్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు సిరిగిరిపేట్ వీరేందర్ రెడ్డిని మండల పార్టీ అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా నియామకమైన వీరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని అన్నారు.

ఇదికూడా చదవండి…

భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు