జన జాతరను జయప్రదం చేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

జన జాతరను జయప్రదం చేయండి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– నేతలు, కార్యకర్తలకు ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జన జాతర సభను జయప్రదం చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రేపు శనివారం హైదరాబాద్లోని తుక్కుగూడలో జన జాతర సభ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. సభకు నేతలు, కార్యకర్తలను తరలించేందుకు ప్రతి మండలానికి ప్రత్యే బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. కావున తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

ఘనంగా జగ్జీవన్‌ రాం జయంతి