కొత్త సమాజంతో సంబంధం లేదు

తాండూరు రాజకీయం వికారాబాద్

కొత్త సమాజంతో సంబంధం లేదు
– లింగ బలిజ సంఘంతో తప్పుదోవ
– ఖండించిన వీరశైవ సమాజం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వీరశైవ సమాజంతో కొత్తగా ఏర్పాటైన లింగ బలిజ సంఘంకు సంబంధం లేదని సమాజం అధ్యక్షులు ఆర్.బస్వరాజ్, కార్యదర్శి లింగదలి రవికుమార్ తెలిపారు. శుక్రవారం తాండూరులో లింగ బలిజ సంఘం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘం సభ్యులు ప్రకటించడాన్ని శనివారం తాండూరు వీరశైవ సమాజం సభ్యులు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరులో ఉన్న వీరశైవ సమాజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొనసాగుతుందన్నారు.

అప్పటి నుంచి సమాజం ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తూ వస్తుందన్నారు. సమాజం సభ్యులను మభ్య పెట్టేందుకు లింగ బలిజ సంఘం అంటూ కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎవ్వరు నమ్మవద్దన్నారు. లింగ బలిజ సంఘంతో వీరశైవ సమాజంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశా కొత్త సంఘం ఏర్పాటును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమాజం సభ్యులు వాలి శాంతుకుమార్, సంపత్, సద్ది భద్రణ్ణ, శెట్టి భాస్కర్, నిర్ని చంద్రశేఖర్, గంగా శ్రావణ్, వాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు.

ఇదికూడా చదవండి…

బెధిరించి బాలికపై అత్యాచారం..!