జుంటుపల్లి రాములోరి సేవలో మనోహరన్న..!
– కళ్యాణోత్సవంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు
– మొక్కు చెల్లించుకున్న తాండూరు ఎమ్మెల్యే
– పాల్గొన్న చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలం జుంటుపల్లి సీతారాముల సేవలో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తరించారు. బుధవారం జుంటుపల్లి సీతారామ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయంలో వెలసిన సీతారామ స్వాములను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు.
అంతకుముందు కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వార్లకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భక్తులకు అన్నదానం చేశారు. ఎమ్మెల్యే వెంట నాయకులు కరణం పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్ కుమార్, సురేందర్ రెడ్డి, వడ్డె శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

