యువజన సేవా మార్గం భేష్..!
– నీరు, మజ్జిగ, అంబలి పంపిణీ అభినందనీయం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఆర్యవైశ యువజన సంఘం చలివేంద్రాల ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఆర్యవైశ్య యువజన సంఘం ముందుకు రావడం ఆదర్శనీయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో యాలాల మండలం చెన్నారం అనిల్ గార్డెన్ గేటు వద్ద జుంటుపల్లి జాతరకు వెళ్లే భక్తులకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా యువత సేవా కార్యక్రమాలకు ముందుండాలని అన్నారు.
ఇందులో భాగంగా ఆర్యవైశ్య యువజన సంఘం జాతర భక్తుల కోసం తాత్కాళికంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చల్లని నీరుతో పాటు మజ్జిగను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వారి సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచిత మజ్జిగ. రాగి జావ (అంబలి) పంపిణి కార్యక్రమమ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు భాను కుమార్, కార్యదర్శి పునీత్ కుమార్, కోశాధికారి రాజ వంశీ, ఉపాధ్యక్షులు పోల నవిన్, గుబ్బ నరేష్, దాచ చందు, సహాయ కార్యదర్శులు కటకం హరీష్, నెమలిగా శ్రీనివాస్, పీఆర్వో కే ఆదిత్య కమిటీ సభ్యులు వివిధ కమిటీ చైర్మన్లు గోపనపల్లి సాయి, తర్లపల్లి విపుల్, శంభుని శేఖర్, ఆర్యవైశ్య సంఘ పెద్దలు కటకం వీరేందర్, కుంచం మురళీధర్, భీమ్ శెట్టి అనిల్ కుమార్, కోట మురళీకృష్ణ, కోట్రిక కిరణ్ కుమార్, సత్యనారాయణ, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

