ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
– శ్రీ సాయి మేధాలో ఆకట్టుకున్న వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థులు ఉపాధ్యాయులుగా.. చాచా నేహ్రులా మారి స్వయం పరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. సోమవారం తాండూరు పట్టణం శివాజీ చౌక్ సమీపంలో ఉన్న శ్రీ సాయి మేధా విద్యాలయంలో బాలల దినోత్సవం, స్వయం పరిపాలన దినోత్సాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. పాఠశాలకు చెందిన చిన్నారి విద్యార్థులు బాల నెహ్రుల వేషాధారణలో ఆకట్టుకున్నారు. అదే పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులుగా
మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక పదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వయం పరిపాలన దినోత్సవంలో ఆకట్టుకున్న విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్‌రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సజిత, డైరెక్టర్లు రోహిత్‌కుమార్, మంజుల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
