సునీతా సంపత్‌కు శుభాకాంక్షల వెల్లువ
– సన్మానించిన తాండూరు వీరశైవ సమాజం
– ఓబీసీలో మార్చేలా చూడాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్కు శుభాకాంక్షల వెల్లువ ప్రారంభమైంది. టీపీసీసీ రాష్ట్ర ఓబీసీ డిపార్ట్మెంట్ కన్వీనర్‌గా సునితా సంపత్ నియామకం అయ్యారు. ఈ సందర్బంగా తాండూరు వీరశైవ సమాజం సభ్యులు సునీతా సంపత్‌ను కలిసి శుభాంక్షలు తెలిపారు. సునీతా సపంత్తో పాటు డాక్టర్ సంపత్ కుమార్‌లను శాలువాల పూలమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్‌లను కేంద్రంలో ఓబీసీలోకి మార్చే విధంగా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సునీతా సంపత్ మాట్లాడుతూ ఓబీసీ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదలి రవికుమార్, సభ్యులు వాలి శాంతుకుమార్, నిర్ని చంద్రశేఖర్, సడ్గి భద్రణ్ణ, సంపత్, పరమేశ్వర్, వాలి శ్రావణ్, గంగా శ్రావణ్, శెట్టి భాస్కర్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

