గిట్టుబాటుతో ధాన్యం కొనుగోళ్లు

తాండూరు రాజకీయం వికారాబాద్

గిట్టుబాటుతో ధాన్యం కొనుగోళ్లు
– రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దు
– వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని వికారాబాద్ జిల్లా ఆడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. శనివారం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖీ మాట్లాడారు.

రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. రైతులు నిబంధనలు పాటించి కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకరావాలని సూచించారు. ధాన్యం తడవకుండా, శుభ్రంగా ఉంచుకుని.. తేమ శాతంను దృష్టిలో ఉంచుకుని కేంద్రాలకు తరలించాలన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.

అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఇంచార్జ్ని ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లర్లకు చేరేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వివరాలను ఆన్లైన్ ప్రొక్యూర్ మెంట్ లో నమోదు. చేయాలన్నారు. కేంద్రంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు టార్పలిన్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

ధాన్యాన్ని లారీలలో ఎత్తేందుకు కూలీల సంఖ్యను పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్, తహసీల్దార్ తారాసింగ్, ఆర్ఎ బాలరాజు, డీసీఎంఎస్ ఇంచార్జ్ మేనేజర్ ఎల్లయ్య, రైతులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

రేపు తాండూరులో పవర్ కట్