బావిలో డెడ్ బాడీ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బావిలో డెడ్ బాడీ..!
– పాత తాండూరులో ఘటన
– సీతారాంపేట్ కు చెందిన యువకుడిగా గుర్తింపు
– దర్యాప్తు చేపట్టిన పోలీసుల
తాండూరు, దర్శిని ప్రతినిధి: బావిలో ఓ యువకుడు మృతదేహం లభ్యమైన సంఘటన తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో వెలుగులోకి వచ్చింది. పాత తాండూరులోని నిజాం షాహీ దర్గా సమీపంలో బావిలో గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుని వద్ద వివరాలను పరిశీలించారు. కానీ ఎలాంటి వివారాలు తెలియరాలేదు. స్థానికులు మాత్రం మృతిచెందిన వ్యక్తి పాత తాండూరుకు చెందిన వారు కాదని తెలిపారు. పోలీసులు కూడా వ్యక్తి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. బావిలో నీటిని శాంపుల్ తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సీసీ పుటేజీనీ పరిశీలించి దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా మృతి చెందిన యువకుడు పాత తాండూరులోని హరిజన్‌ వాడకు చెందిన జెట్టుపాగ వెంకటేష్‌గా గుర్తించారు. మృతుని తల్లి చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

మాదక ద్రవ్యాలతో జీవితాలు చిద్రం