పాలిసెట్‌లో తాండూరు విద్యార్థుల ప్రతిభ

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrపాలిసెట్‌లో తాండూరు విద్యార్థుల ప్రతిభ
– ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు
తాండూరు,దర్శిని ప్రతినిధి : పాలిసెట్‌ పరీక్షా ఫలితాల్లో వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు ప్రాంతానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపించుకున్నారు. గత మే 24న వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని మూడు కేంద్రాల్లో ప్రవేశ పరీక్షను నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం ఫలితాలు విడుదలయ్యాయి.

ఈ పరీక్షకు హాజరైన యాలాల్‌ మండలం కమలాపూర్‌కు చెందిన పి.అశ్రితా రెడ్డి ఎంబైపీసీలో 232 ర్యాంక్‌ పొందారు. అదేవిధంగా తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన పి.హార్థిక్‌రెడ్డి ఎంపీసీలో 429 ర్యాంక్‌ను తెచ్చుకున్నారు. ఎంబైపీసీ ర్యాంకును సాధించిన విద్యార్థులు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సును చేయడానికి అర్హులు, ఎంపీసీలో ర్యాంకును సాధించిన విద్యార్థులు పాలిటెక్నిక్‌ కోర్సును అర్హులని జిల్లా కోఆర్డీనేటర్ ఎం.పరమేశ్వర్‌ తెలిపారు.

ఇదికూడా చదవండి…

కుక్కను ఎత్తుకెళ్లిన కంత్రిగాళ్లు..!