
గ్రూపు-1 ప్రశాంతం..!
– తాండూరులో ఆలస్యంగా కొంతమంది
– కేంద్రాలను పర్యవేక్షించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష తాండూరులో ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. గ్రూపు-1 పరీక్షను దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సింధూ డిగ్రీ కాలేజీ, సింధూ బాలికల జూనియర్ కళాశాల, సిద్దార్థ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ పరీక్షా కేంద్రాలలో మొత్తం 1488 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంది. పరీక్షా సమయానికంటే ముందు అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు. పట్టణంలోని ఆయా కేంద్రాల పలువురు అభ్యర్థులు ఆలస్యంగా చేరుకున్నారు. లోపలికి అనుమతించకపోవడంతో చేసేందుకు ఏమిలేక వెనుదిరిగి వెళ్లిపోయారు.

మరోవైపు గ్రూపు-1 పరీక్షా కేంద్రాలను తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సందర్శించారు. సీఐలు, ఎస్‌ఐలతో పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమలుకు చర్యలు తీసుకున్నారు. పరీక్ష ప్రశాంతంగా జరిగేలా దృష్టిసారించారు.

ఇదికూడా చదవండి…

