వివాదాస్పద భూమి ప్రభుత్వానిదే..!
– వీవీహెచ్ఎస్ క్రీడా మైదానంపై విచారణ
– బోర్డు తొలగించాలని ఆదేశించిన తహసీల్దార్
– భూమి మాదే : ప్రసారం కుటుంభీకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం విజయ విద్యాలయ పాఠశాల సమీపంలోని వివాదాస్పద స్థలం ప్రభుత్వానిదే అని స్థానిక తహసీల్దార్, అధికారులు తెలిపారు. సోమవారం క్రీడా మైదానం స్థలం వద్దకు వచ్చి తాండూరు తహసీల్దార్ తారాసింగ్, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఆరి బాలరాజ్, సర్వేయర్లు విచారణ చేపట్టారు.

స్థలం కబ్జాలో ఉన్న పసారం కుటుంభీకులతో కలిసి స్థలం వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సర్వేనెంబర్ 111లో వివాదాస్పదంగా మారిన 14 గుంటల భూమి ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లు రికార్డులు ఉన్నాయని తెలిపారు. కబ్జాలో ఉన్న వారి వద్ద భూమికి సంబంధించి డాక్యుమెంట్లో సర్వే నెంబర్కు సంబంధించిన వివరాలు లేవని తెలిపారు. అందుకే వివాదాస్పద భూమి ప్రభుత్వానికి చెందుతుందని స్పష్టం చేశారు. కబ్జాలో ఉన్న వారు బోర్డు తొలగించాలని ఆదేశించడం జరిగిందన్నారు.

మరోవైపు పసారం కుటుంభీకులు బస్వరాజ్, నిషాంక్ లు మాట్లాడుతూ 1945 నుంచే ఈ భూమి మా కుటుంబానికి చెందిందని అన్నారు. భూమి తమదే అని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. కావాలనే అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, విషయాన్ని కోర్టు ద్వారా తేల్చుకుంటామని. తెలిపారు. మరోవైపు ప్రభుత్వ స్థలంలో స్కూల్ వాళ్లే అక్రమ నిర్మాణం, ఇతర వ్యాపారాలకు వినియోగించుకుంటున్నారని అరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పటేల్ కిరన్ కుమార్, భగవాన్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

