ప్రజా సమస్యలపై ఫోకస్..!
– వర్షాకాలం ఇబ్బందులపై నజర్
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి
– ప్రభుత్వా శాఖల అధికారుల సమన్వయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేక చర్యలు తీసుకునేలా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సోనువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గ ఆర్అండ్బీ, ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులతో సమావేశం అయ్యారు. ఆయా శాఖల పనితీరుపై సమీక్ష జరిపారు. వర్షకాలంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు.

ఇదికూడా చదవండి…

